బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ పరిధి 13వ వార్డు సోమ్లా తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శనివారం మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు.