జాయింట్ కలెక్టర్ పర్యటనను అడ్డుకున్న రైతులు

జాయింట్ కలెక్టర్ పర్యటనను అడ్డుకున్న రైతులు

నంద్యాల జిల్లాలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ పర్యటనను సీపీఐ రైతు సంఘాల నేతల ప్రతినిధులు మంగళవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు కోత దశలో ఉన్న పంటలను కాపాడేందుకు కేసీ కాలువకు నీరు వెంటనే విడుదల చేయాలని ముచ్చుమరి సమీపంలో రహదారిపై బైఠాయించారు. ఈ సంఘటనతో రైతుల ఆందోళన తీవ్రమైంది. అనంతరం రైతుల సమస్యను జేసీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు.