500కు పైగా ఉద్యోగాలకు ఈనెల 12న జాబ్ మేళా

500కు పైగా ఉద్యోగాలకు ఈనెల 12న జాబ్ మేళా

TPT: వెంకటగిరి పట్టణంలో ఈనెల 12న 500కు పైగా ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం తెలిపారు. శ్రీసిటీ, మేనకూరు సెజ్,ఈఎంసీ క్లస్టర్, చెన్నైకు చెందిన 12 బహుళ జాతి కంపెనీలలో ఉద్యోగాల కొరకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుండి పీజీ వరకు అర్హులని చెప్పారు. వివరాలకు 7013509543 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.