చంద్రబాబుకు జోగి రమేష్ కుమారుడు సవాల్
AP: సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ సవాల్ విసిరారు. చంద్రబాబు, లోకేష్‌కు చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ఈ కేసులో తమ ప్రమేయం లేదని తెలిపారు. గత ఏడాది ఆయనతో పాటు తన తండ్రిని అరెస్ట్ చేసినట్లు గుర్తుచేశారు. అక్రమ అరెస్టులు ఎల్లకాలం సాగవని ప్రభుత్వం పెద్దలు గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.