జంగాలపల్లిలో కాంగ్రెస్ సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
MHBD: గంగారం మండలం జంగాలపల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ తార శీను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికవడం సంతోషకరమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు అన్నారు. ఆమెను శాలువాతో సత్కరించి, సహకరించిన గ్రామస్థులను అభినందించారు. గ్రామ అభివృద్ధిలో యువత పాత్ర ముఖ్యమని, ఈ ఏకగ్రీవానికి యువత శక్తి ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు.