మండల బీజేపీ అధ్యక్షుడిగా వెంకటరమణ

కోనసీమ: అయినవిల్లి మండల బీజేపీ నూతన అధ్యక్షుడిగా యనమదల వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పూర్వపు అధ్యక్షుడు చంద్రశేఖర్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో బూత్ కమిటీ అధ్యక్షులు, క్రియాశీలక సభ్యులు, నాయకులు ఈ మేరకు ఆయనను ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.