శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవం..!
SDPT: గజ్వేల్ పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవం మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుండగా, శనివారం అభిషేకం, హోమం కుంకుమార్చనలు పారాయణం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లి ఆలయ సముదాయంలో మహిళలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, అమ్మవారి నామ స్మరణతో మార్మోగింది.