పెనుకొండలో గ్యాస్ గోడౌన్‌ను తనిఖీ చేసిన జేసీ
సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోడౌన్‌ను జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్ల నిల్వలు, సరఫరా విధానం, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ సరఫరా సక్రమంగా జరగాలని అధికారులకు సూచనలు చేశారు. అలాగే గోడౌన్‌లో భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.