VIDEO: మద్యం మత్తులో దాడి.. ఇద్దరికీ గాయాలు

VIDEO: మద్యం మత్తులో దాడి.. ఇద్దరికీ గాయాలు

ELR: నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో మద్యం సేవించిన పదిమంది వ్యక్తులు కర్రలతో దాడి చేయడంతో గాయాల పాలయ్యామని గ్రామానికి చెందిన చెల్లా మారేశ్వరరావు(40), రాఘవరావు(35)లు ఆదివారం తెలిపారు. బాధితులు తీవ్ర గాయాల పాలు కావడంతో సన్నిహితులు నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.