మోదీ నిర్ణయం దేశప్రజలందరికీ ఊరటనిస్తోంది: పవన్

మోదీ నిర్ణయం దేశప్రజలందరికీ ఊరటనిస్తోంది: పవన్

AP: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సెజ్ సుంకం తగ్గించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రధాని మోదీ నిర్ణయం దేశప్రజలందరికీ ఊరటనిస్తోందని తెలిపారు. ప్రజలపై ఇంధన భారం పడకుండా ప్రధాని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ఎన్డీఏ నిరూపించుకుందని కొనియాడారు.