'పొంగులేటి అధికార దుర్వినియోగం చేస్తున్నారు'
TG: రెవెన్యూ, సమాచార శాఖలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని BRS నేత RS ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. నాదర్‌గుల్ భూములను అధికారులు కాపాడాలని కోరారు. చట్టబద్ధంగా సంపాదిస్తే అభ్యంతరం లేదని, సరైన పత్రాలతో వస్తే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కోట్ల రూపాయలు దోచుకుంటున్నా.. అధికారులు ఉపేక్షిస్తే ఊచలు లెక్కించాల్సిందేనని హెచ్చరించారు.