VIDEO: నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి: ఛైర్మన్
WNP: నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని పెబ్బేరు మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. సోమవారం నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సుమిత్ర ఎల్లా రెడ్డిలను శాలువాలతో సత్కరించి వినతిపత్రం అందజేశారు. కుల వృత్తిదారుల సంక్షేమానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఛైర్మన్ భరోసా ఇచ్చారు.