VIDEO: ఘనంగా శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్య వైశ్య కుటుంబాలు భక్తిశ్రద్ధలతో సామూహిక పూజలు చేశారు. సాంప్రదాయ రీతిలో అలంకరించిన వేదికపై వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణేశ పూజ, అధాంగ పూజ, షోడశోపచార పూజ, అష్టోత్తర పూజ, కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు.