సమాజంలో మార్పు చదువుతోనే సాధ్యం: ఎమ్మెల్యే
GDWL: జిల్లాలోని సమాజంలో మార్పు తీసుకురావడానికి చదువుతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ అన్నారు. శనివారం కేఎస్ ఫంక్షన్ హాల్లో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన మోటివేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు మోటివేషన్, అవగాహన ఎంతో అవసరమని, చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.