వరంగల్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

వరంగల్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

WGL: ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రాఘవేందర్ కథనం ప్రకారం.. బాలాజీనగరికి చెందిన జక్కోజు శివకృష్ణచారి(31) కూలీ పని చేస్తుండేవాడు. తరచూ మద్యం తాగి ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. నిన్న సాయంత్రం మద్యం తాగి వచ్చిన అనంతరం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. భార్య లావణ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.