'ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి'

'ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి'

పల్నాడు: చిలకలూరిపేటలో మంగళవారం ఎంఈవో కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నేతలు వినతిపత్రం ఇచ్చారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధిక ఉష్ణోగ్రతల మధ్య విద్యార్థులపై ఒత్తిడి పెంచుతూ ప్రభుత్వ నిబంధనలను పక్కనపెడుతున్న యాజమాన్యాలపై గుర్తింపు రద్దు సహా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.