ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో ఉంచవద్దు: కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో ఉంచవద్దు: కలెక్టర్

నల్గొండ: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని.. పెండింగ్లో ఉంచవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 53 ఫిర్యాదులు రాగా, అందులో రెవెన్యూకు సంబంధించి (26), ఇతర శాఖలకు సంబంధించి (27) దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.