'ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచేందుకు కృషిచేస్తున్నాం'
GNTR: హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రేపటి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కూర్మాల కనకపుట్లమ్మను మంగళవారం మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసానికి సదరు విద్యార్థినితో పాటు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మంత్రి మాట్లాడారు.