కనువిందు చేస్తున్న మిడ్ మానేరు బ్యాక్ వాటర్
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మిడ్ మానేరు బ్యాక్ వాటర్ పొగ మంచులో కనువిందు చేస్తోంది. మిడ్ మానేరు ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నింపడంతో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మానేరు వాగులో సిరిసిల్ల బ్రిడ్జ్ దాటి గంగమ్మ గుడి వరకు చేరుకున్నాయి. దీంతో ఈ ప్రాంతమంతా బుధవారం ఉదయం ఉష్ణోగ్రతలు తగ్గి పొగ మంచు కప్పుకోవడంతో ఈ ప్రాంతమంతా చూపరులను ఆకట్టుకుంటుంది.