ఎన్నికల్లో పోటీ చేయం: కమల్ హాసన్

ఎన్నికల్లో పోటీ చేయం: కమల్ హాసన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ నటుడు, మక్కళ్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ కీలక ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ నేరుగా పోటీ చేయబోదని వెల్లడించారు. డీఎంకే నేతృత్వంలోని కూటమికి బేషరతుగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.