VIDEO: కారు, బైక్ ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు
MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం హనుమాన్ విగ్రహం మూలమాలపు వద్ద కారు, బైకు ఢీ కొన్నాయని తెలిపారు. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తల పగిలి తీవ్రమైన రక్త స్రావం అయింది. అంబులెన్సు రావడం ఆలస్యం కావడంతో స్థానికులు బైక్‌పై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.