హెచ్ఐవీపై విద్యార్థులకు అవగాహన సదస్సు
KDP: మైదుకూరు డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి అధ్యక్షతన గురువారం హెచ్ఐవీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. హెచ్ఐవీని అరికట్టడంలో విద్య ప్రధాన ఆయుధమని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని వైస్ ప్రిన్సిపాల్ సుభాన్ సాహెబ్ సూచించారు. వ్యాధి నివారణ, చికిత్స, ఆరోగ్య జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.