'అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం'

ప్రకాశం: పెద్దారవీడు మండలం సుంకేసులకు చెందిన జి. కుమారికి మంగళవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించే క్రమంలో నొప్పులు ఎక్కువ అవ్వడంతో అంబులెన్స్‌లోనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు ఫిజీషియన్ డాక్టర్ శ్రీ లక్ష్మి తెలిపారు.