బీసీ కోటా ఖరారుకు డెడికేటెడ్ కమిషన్
Vsp: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు బీసీల జనాభా అధ్యయనం చేయనున్నారన్నారు.