VIDEO: ఉత్సాహంగా కైట్ ఫెస్టివల్
విశాఖపట్నం సాగర తీరం రంగురంగుల గాలిపటాలతో కొత్త శోభను సంతరించుకుంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆర్కే బీచ్‌లో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ నగరవాసుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. నీలాకాశంలో రకరకాల ఆకృతులు, విభిన్న పరిమాణాల్లో గాలిపటాలు ఎగురుతుంటే పర్యాటకులు మంత్రముగ్ధులయ్యారు. కేవలం పిల్లలే కాకుండా పెద్దలు కూడా పోటీపడి గాలిపటాలు ఎగురవేశారు.