చరిత్ర మార్చిన రోజు ఇది: కేటీఆర్
TG: ఇవాళ కేసీఆర్ దీక్షా దివస్ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. '16ఏళ్ల క్రితం తెలంగాణ భవితవ్యాన్ని మార్చి రాష్ట్రావతరణకు దారి తీసిన రోజు ఇది. నవంబర్ 29, 2009 చరిత్రలో నిలిచిపోతుంది' అని ట్వీట్ చేశారు. కేసీఆర్ అరెస్ట్ అయిన సందర్భంగా.. అప్పటి వీడియోను కేటీఆర్ పంచుకున్నారు.