నేడు తిరుపతిలో బుగ్గమఠం భూముల సర్వే

తిరుపతిలో బుగ్గమఠం భూముల సర్వేను అధికారులు చేయనున్నారు. 16వ ఆర్థిక సంఘం పర్యటన దృష్ట్యా గత నెలలో చేయాల్సిన సర్వే వాయిదా పడింది. ఆక్రమిత భూముల సర్వే కోసం.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరో నలుగురికి నోటీసులు అందించారు. అయితే ఆ భూములతో తనకు సంబంధం లేదని పెద్దిరెడ్డి చెప్పారు. వాటిని తన సోదరుడు ద్వారకానాథరెడ్డి కొనుగోలు చేశారని వివరణ ఇచ్చారు.