వైజాగ్‌లో మరో ప్రతిష్టాత్మక డేటా సెంటర్.!
VSP: వైజాగ్‌లో మరో ప్రతిష్టాత్మక డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. సిఫీ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో వైజాగ్‌లో 500 మె.వా. డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ టెక్ దిగ్గజం మెటా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్‌లను నిర్వహిస్తున్న మెటా.. విశాఖకు 25 కి.మీ. దూరంలోని కోల్‌కతా- శ్రీకాకుళం హైవేపై పరదేశిపాలెంలో డేటా సెంటర్ పెట్టనున్నట్లు సమాచారం.