అందుకే ఆ సినిమా చేశా: రామ్
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం వస్తోన్న సినిమాలు వైల్డ్‌గా ఉన్నాయని అన్నాడు. దీంతో తాను సౌమ్యమైన భావోద్వేగ సినిమాను చేయాలని డిసైడ్ అయ్యానని, అందుకే ఈ మూవీని చేశానని చెప్పాడు. ఇది ప్రేక్షకులు ఇష్టపడే విధంగా తెరకెక్కిందన్నాడు.