'అరక పనులకు శ్రీకారం చుట్టిన రైతులు'

'అరక పనులకు శ్రీకారం చుట్టిన రైతులు'

ADB:  ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జల్లా వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ పనులకు శ్రీకారం చుట్టారు. తెల్లవారుజామునే లేచి.. వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలు చేసి చద్దన్నం అరగించి.. పొలంబాట పట్టారు. పంట చేనులో అరే చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేసి, సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని ఆ భగవంతుని వేడుకొని అరక కట్టి పొలం పనులను ప్రారంభించారు.