'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
ప్రకాశం: పామూరు పట్టణంలోని స్థానిక అంకాలమ్మ వీధిలో ఆదివారం ఎస్సై అనూక్ ప్రజలతో సమావేశమై రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, క్రికెట్ బెట్టింగ్ వంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ట్రాఫిక్ నియమాలు పాటించడం, అపరిచిత లింకులు క్లిక్ చేయకపోవడం, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండడం వంటి సూచనలు చేశారు.