కర్నూలు బస్సు ప్రమాదం.. 27 మందిపై కేసు
AP: ఇటీవలి కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు మొత్తం 27 మంది మీద కేసు నమోదుచేశారు. నిందితుల్లో ఆరే శ్యామల, సీవీ రెడ్డి, కందుకూరి గోపికృష్ణ సహా పలువురు YCP నేతలు ఉన్నారు. కాగా ఈ ప్రమాదం బెల్టు షాపులు, కల్తీ మద్యం కారణంగానే జరిగిందంటూ సోషల్ మీడియాలో పలువురు ఆరోపిస్తున్నారు.