జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తులు
PDPL: జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. బీపీఎల్ కుటుంబాల్లో 18–60 ఏళ్ల మధ్య వయస్సు గల పోషకుడు మరణిస్తే రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తారు. పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ, ఎంఆర్‌వో కార్యాలయాలు లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.