వీవోఏలకు ఉచిత సెల్ ఫోన్లు అందించిన ఎమ్మెల్యే
కృష్ణా: స్వయం సహాయక సంఘాల సహాయకులు ఉత్తమ పని తీరుతో డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి సహకారం అందించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. బుధవారం కోడూరులో మండలంలోని వీవోఏలకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన ఉచిత మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సౌజన్య కిరణ్మయి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.