'ప్రజలపై విద్యుత్ భారాలు మోపడం దుర్మార్గం'

ATP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న 12.771 కోట్ల రూపాయల విద్యుత్ భారాలను మోపడం దుర్మార్గమని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో CPM నాయకులతో కలిసి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ చార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలని, ట్రూ అప్ ఇంధన సర్దుబాటు చార్జీల విధానాన్ని రద్దు చేయాలన్నారు.