గంగూలీ ఇప్పటికే ఐసీసీ చీఫ్ కావాల్సింది! - దీదీ
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కావాల్సిందని అభిప్రాయపడ్డారు. ఏదో ఒకరోజు ఆయన తప్పకుండా అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించిన మహిళల ప్రపంచ కప్ విజేత రిచా ఘోష్ సన్మాన కార్యక్రమంలో ఈ విధంగా మాట్లాడారు.