విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్
NRPT: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ శాఖల వసతి గృహాలలో మధ్యాహ్న భోజన పథకం మెనూ కచ్చితంగా వంద శాతం అమలు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజనానికి వినియోగించే బియ్యం, ఇతర వంట సరుకులు పూర్తి స్థాయిలో నాణ్యతతో కూడినవి వినియోగించాలన్నారు.