'కేంద్రాలకు మరమ్మతులు నాణ్యతతో చేపట్టాలి'
NZB: భవిత కేంద్రాల మరమ్మతులు నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. NZB జిల్లా కేంద్రంలోని శంకర్ భవన్ ఆవరణలో గల భవిత కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మరమ్మతుల కోసం అవసరమైతే మరిన్ని నిధులు జిల్లా యంత్రాంగం తరపున సమకూరుస్తామని హామీ ఇచ్చారు.