రొటేషన్ పద్ధతిలో వైద్య శిబిరాలు
PPM: సీతంపేట గిరిజన ప్రాంతాల్లో రోటేషన్ పద్దతిలో వైద్య శిబిరాలను నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. భాస్కరరావు తెలిపారు. ఈ నెల 16వ తేదీన ఓ పత్రికలో వచ్చిన సంతలో వైద్యం శీర్షికనపై ఆయన గురువారం వివరణ ఇచ్చారు. మెట్టూరు గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ జ్వరం, వాంతులు, బిపి కేసులను చూస్తున్నట్లు దృష్టికి వచ్చింధన్నారు.