'చెరువుల వద్దకు ఎవరూ వెళ్లొద్దు'

'చెరువుల వద్దకు ఎవరూ వెళ్లొద్దు'

NZB: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ MPDO శివాజీ సూచించారు. నేడు ఆయన మాట్లాడారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నందున ఎవరూ చెరువులు, వాగులు, వంకలు, నదుల వద్దకు వెళ్లవద్దన్నారు. వర్షాల వల్ల ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మమ్స్‌కు దూరంగా ఉండాలన్నారు.