మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ
KNR: తెలంగాణ రాష్ట్రంలో మరో 6 నెలలు కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్టు, మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శాంతియుత వాతావరణం కోసం వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు ఉద్యమాలు చేశారని వారి ఆంక్షలకు అనుగుణంగా గతంలో కాల్పుల విరమణ ప్రకటించినట్టు గుర్తు చేశారు. ఆ గడువు ముగియటంతో మళ్లీ పొడిగిస్తున్నామన్నారు.