రిలయన్స్‌కు GST కార్యాలయం జరిమానా

రిలయన్స్‌కు GST కార్యాలయం జరిమానా

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అహ్మదాబాద్ GST కమిషనర్ కార్యాలయం రూ.57 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ నౌకలను అద్దెకు తీసుకునే సేవల వర్గీకరణలో 2017 జూలై 1 నుంచి 2018 జనవరి 24 మధ్య తక్కువ పన్ను చెల్లించినందుకు ఈ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్‌పై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇది సాధారణమని, దీనివల్ల రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.