కాంగ్రెస్ బడ్జెట్ అంకెల గారడీ.. బీఆర్ఎస్ విమర్శలు
WGL: పర్వతగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతోందని, పథకాల అమలులో విఫలమైందని ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలులో విఫలమైందన్నారు. కాంగ్రెస్ బడ్జెట్ అంకెల గారడిని. ఎన్నికల హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.