VIDEO: కనిగిరిలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన RDO

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను పరిశీలించి, స్టాక్ రిజిస్టర్లలోని వివరాలు సక్రమంగా ఉన్నాయో, లేవో చూశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశామని, రైతులకు ఎక్కడా ఎరువుల కొరత లేకుండా వాటిని పంపిణీ చేయాలని ఆదేశించామన్నారు. ఇందులో భాగంగా ఏడిఏ జైనులాబ్దిన్ పాల్గొన్నారు.