పంటలపై మళ్లీ ఏనుగుల గుంపు దాడులు

పంటలపై మళ్లీ ఏనుగుల గుంపు దాడులు

CTR: పులిచెర్ల మండలంలో పంటలపై మళ్లీ ఏనుగుల గుంపు దాడులు ప్రారంభమయ్యాయి. పశ్చిమ విభాగం అటవీ ప్రాంతంలోని గోగులమ్మ వంక నుంచి శుక్రవారం రాత్రి వచ్చిన ఏనుగుల గుంపు కల్లూరు, పాళ్యం పంచాయతీల్లో మామిడి పంటలను ధ్వంసం చేశాయి. అక్కడి నుంచి తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోకి ఏనుగులు గుంపు చేరుకున్నట్లు రేంజర్ థామస్ సుకుమార్, ఎఫ్ఎస్వో మహమ్మద్ షఫి తెలిపారు.