బాలుడి అదృశ్యం.. కేసు నమోదు

NZB: జిల్లా కేంద్రంలో 12 సంవత్సరాల బాలుడు అదృశ్యమైనట్లు వన్ టౌన్ SHO రఘుపతి గురువారం తెలిపారు. కోటగిరికి చెందిన సంతోష్ మార్చి 31వ తేదీన తాత, నానమ్మ వద్దకు నిజామాబాద్ బస్టాండ్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి బాలుడు కనిపించండం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.