వేములవాడలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

SRCL: వేములవాడలోని సంఘమిత్ర పాఠశాలలో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ వేడుకలు నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.