నందవరం హెడ్ కానిస్టేబులు ప్రశంసా పత్రం

KRNL: నందవరం మండలంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కోదండ రామిరెడ్డి గురువారం కర్నూలులో ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ.. నందవరం మండలంలో విధి నిర్వహణలో మిస్సింగ్ కేసు ఛేదించినందుకు ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రం అందుకున్నానన్నారు. పోలీసు సిబ్బంది, పలువురు అభినందనలు తెలిపారు.