'కట్టలేరు మళ్లింపు రహదారి పనులు చేపట్టండి'
NTR: గంపలగూడెం కట్టలేరు మల్లింపు రహదారి పనులు వెంటనే చేపట్టాలని ప్రయాణికులు కోరుచున్నారు. ఇప్పటికే రెండు నెలలు ఆ రహదారిపై నిలిచిపోయిందని వాపోతున్నారు. ప్రధానంగా విద్యార్థులు స్కూళ్లకు నెలల తరబడి సెలవులు పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం రాళ్లపై నడవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు. అధికారులు స్పందించి రహదారి పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు.