గుంటూరులో లోక కళ్యాణం కోసం చండీ హోమం
గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం భక్తిశ్రద్ధలతో సోమవారం రాత్రి చండీ హోమం నిర్వహించారు. పౌర్ణమి, గ్రహశాంతి సందర్భాన్ని పురస్కరించుకుని కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 9 మంది వేదపండితులు గణపతి, శివలింగం, నవగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు చేశారు.